గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కోరారు. స్థానిక ప్రాంతీయ వైద్యశాలలో మూడు మొక్కలను ఆయన నాటారు. అనంతరం హుజూర్నగర్ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి : సైదిరెడ్డి - Suryapet Huzurnagar Government Hospital
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో మూడు మొక్కలను ఆయన నాటారు.
ఎమ్మెల్యే సైదిరెడ్డి
ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. వైద్యశాలలో అవసరమైన సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత, ఇతర సమస్యలను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. నియోజకవర్గాన్ని విరివిగా చెట్లను పెంచి... అటవీ అభివృద్ధి కేంద్రంగా మార్చేందుకు యత్నిస్తున్నామన్నారు.
ఇదీ చూడండీ :'డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం.. అద్దె బస్సు బకాయిలు చెల్లించండి'
TAGGED:
MLA Saidi Reddy Latest News