వాళ్లంతా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కార్మికులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడం వల్ల చేతికి పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నారు. దీనివల్ల హైదరాబాద్ నుంచి ఒడిశాకు పయనమైన వలస కార్మికులు సూర్యాపేట జిల్లా నెరేడుచర్లకు చేరుకున్నారు.
వలస కార్మికులకు ఎమ్మెల్యే సాంత్వన - Huzurnagr Mla Saidhi reddy Helps Migrant labours
లాక్‌డౌన్ కారణంగా తమ సొంతూళ్లకు పయనమైన ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను మార్గమధ్యలో హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి చూశారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు.. కుటుంబాల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

Huzurnagr Mla Saidhi reddy Helps Migrant labours in Suryapeta district
రహదారి వెంట చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసిన హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి కోదాడ వరకు వాహనంలో పంపించారు. అక్కడి నుంచి వారికి పాసులు ఇప్పించి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. దీనివల్ల వలస కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.