'అసెంబ్లీకి పంపిస్తారనే నన్ను ఎంపిక చేశారు' - huzurnagar trs candidate saidireddi election campaign at huzurnagar constituency
శాసనసభకు పంపిస్తారన్న నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చిన ఐదు నిమిషాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అభ్యర్థిగా ప్రకటించారని హుజూర్నగర్ శాసనసభ తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లపల్లి టోల్గేట్ వద్ద తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి హుజూర్నగర్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీకి పంపిస్తారన్న నమ్మకంతోనే నోటిఫికేషన్ వచ్చిన ఐదు నిమిషాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అభ్యర్థిగా ప్రకటించారన్నారు. తనపై నమ్మకముంచిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి.. భార్యకు పదవి అందించడంపై ఉన్న దృష్టి నియోజకవర్గం అభివృద్ధి మీద లేదని ఎద్దేవా చేశారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో గెలుపు తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : దేశంలో మళ్లీ ఉల్లి కష్టాలు... కిలో రూ.80..!