కరోనా వైరస్ను చాలా సీరియస్గా తీసుకోవాలని, ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన ఇటలీ లాంటి దేశం సైతం వైరస్ను తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని, వైరస్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కరోనా ప్రమాదకరమైంది.. రాకముందే మేల్కోవాలి: సైదిరెడ్డి - huzurnagar mla saidireddy suggest people to maintain cleanlyness
కరోనా మహమ్మారి ఎంతో ప్రమాదకరమైన వైరస్ అని... రాకముందే నివారించాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

కరోనా ప్రమాదకరమైంది.. రాకముందే మేల్కోవాలి: సైదిరెడ్డి
ఈనెల 22న ప్రభుత్వం పిలుపుమేరకు అంతా జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా వైరస్ను అరికట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేతులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జనతా కర్ఫ్యూ గురించి పదిమందికి ఫోన్ చేసి దీనిలో భాగస్వాములు కావాలని కోరాలన్నారు.
కరోనా ప్రమాదకరమైంది.. రాకముందే మేల్కోవాలి: సైదిరెడ్డి
ఇదీ చూడండి:'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'