తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టం: సైదిరెడ్డి - etv bharath

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చినట్టు హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా మట్టంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

huzurnagar mla saidireddy on new revenue act in suryapeta district
రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టం: సైదిరెడ్డి

By

Published : Sep 12, 2020, 9:56 PM IST

సూర్యపేట జిల్లా మట్టంపల్లిలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సైదిరెడ్డి హాజరయ్యారు. రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ చట్టంతో భూ కబ్జా దారుల నుంచి భూములను రక్షించుకోవచ్చని అన్నారు.

రైతులు తమ భూములు ఆన్​లైన్​లో నమోదు కాక.. పట్టా పుస్తకాలు రాక.. రైతు బంధు, రైతు భీమా పథకాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొ చ్చిందని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు

ABOUT THE AUTHOR

...view details