సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రేపు మంత్రి కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయాన్ని మంత్రి తమ చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. సుమారుగా 48 కోట్ల రూపాయలతో హుజూర్నగర్, నేరేడుచర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని వెల్లడించారు. ఆర్డీవో కార్యాలయం ప్రారంభం అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి - తెలంగాణ ప్రభుత్వం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కుతుందని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. రేపు మంత్రి కేటీఆర్ హుజూర్నగర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.
కరోనా నేపథ్యంలో కార్యకర్తలకు అనుమతి లేదని ఎమ్మెల్యే తెలిపారు. కొవిడ్-19 ప్రబలుతున్న వేళ కార్యకర్తలు తరలివస్తే ఇబ్బందికరంగా మారుతుందని... కావున ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు. హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు వెంకట్‌రెడ్డి, కిషన్‌రావు, మున్సిపల్ ఛైర్మన్ గెల్లి అర్చన రవి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ శ్రీను పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన