హుజూర్‌నగర్ ప్రజా కృతజ్ఞత సభలో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యే సైదిరెడ్డి నృత్యాలు చేసి కార్యకర్తలను ఆకట్టుకున్నారు. కార్యకర్తలు, కళాకారులతో కలిసి తెలంగాణ జానపద గీతాలకు ఉత్సాహంతో స్టెప్పులేశారు. వేదికపైన సైదిరెడ్డి పాదం కదపగా... అరుపులతో ప్రజలంతా ఉత్సాహపరిచారు. హుజూర్‌నగర్‌లో రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సైదిరెడ్డి విజయోత్సాహంతో ఆడిపాడగా... సభాప్రాంగణమంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపోయింది.
సంతోషంతో సైదిరెడ్డి స్టెప్పులు... ప్రాంగణమంతా ఈలలు... - ఎమ్మెల్యే సైదిరెడ్డి నృత్యాలు
హుజూర్‌నగర్‌లో రికార్డు మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరేసిన సైదిరెడ్డి... ప్రజా కృతజ్ఞత సభలో కార్యకర్తలను తన స్టెప్పులతో ఉర్రూతలూగించారు. అభిమానులు, కార్యకర్తలతో కలిసి జానపద గేయాలకు ఉత్సాహంగా చిందులేసి అలరించారు.
HUZURNAGAR MLA SAIDHIREDDY DANCE IN PUBLIC MEETING