తహసీల్దార్లకు రెవెన్యూ దస్త్రాల అప్పగింత - దస్త్రాలు అప్పగించిన వీఆర్వోలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల వీఆర్వోల నుంచి తహసీల్దార్లు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటికి సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు సమర్పించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల వీఆర్వోలు దస్త్రాలను తహసిల్దార్లకు అందజేశారు. పాలకీడు మండలంలో 22 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు, మేళ్లచెర్వు మండలంలో 14 పంచాయతీలు, 5 రెవెన్యూ గ్రామాలు, చింతలపాలెంలో 16 పంచాయతీలు, 6 రెవెన్యూ గ్రామాలు, నేరేడుచర్లల 17 గ్రామ పంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు, గరిడేపల్లిలో 32 గ్రామ పంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు, మఠంపల్లిలో 29 గ్రామ పంచాయతీలు, 10 రెవెన్యూ గ్రామాలు, హుజూర్నగర్లో 11 గ్రామ పంచాయతీలు, 7 రెవెన్యూ గ్రామాల దస్త్రాలను తహసీల్దార్లు స్వాధీనం చేసుకున్నారు.