తెలంగాణ

telangana

ETV Bharat / state

లైవ్​ అప్​డేట్స్: హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్‌ - huzurnagar by elections polling

హుజూర్​నగర్​ ఉపఎన్నిక పోలింగ్

By

Published : Oct 21, 2019, 7:57 AM IST

Updated : Oct 21, 2019, 5:08 PM IST

17:07 October 21

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముగిసిన పోలింగ్‌ 

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు. బరిలో ముగ్గురు మహిళలు సహా 28 మంది అభ్యర్థులు ఉన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో పోలింగ్ జరిగింది. 

16:21 October 21

హుజూర్‌నగర్‌లో మధ్యాహ్నం 3 వరకు 69.95 శాతం పోలింగ్‌ నమోదైంది.

13:19 October 21

ఒంటి గంట వరకు 52.89 శాతం పోలింగ్

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52.89 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇప్పటివరకు 1,25,277 ఓట్లు పోలయ్యాయి.

11:26 October 21

ఉదయం 11 గంటల వరకు 31.34 శాతం పోలింగ్

హుజూర్​నగర్​ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలింగ్​ సరళిని ఎస్పీ భాస్కరన్​ పరిశీలించారు. ఉదయం 11 గంటల వరకు 31.34 శాతం పోలింగ్ నమోదయింది.

11:10 October 21

పోలింగ్​ సరళిని పరిశీలించిన ఎస్పీ భాస్కరన్

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలం కిష్టాపురం, పిట్లనాయక్‌ తండా, తమ్మారంలో పోలింగ్ సరళిని ఎస్పీ భాస్కరన్‌ పరిశీలించారు.

10:17 October 21

పలు చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

హుజూర్​నగర్​ ఉపఎన్నిక ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కాసేపు పోలింగ్​ నిలిచిపోయింది. పాలకవీడు మండలం బెట్టెతండాలో... వీవీప్యాట్, బ్యాలెట్ అనుసంధానంలో సమస్య తలెత్తింది. అటు నేరేడుచర్ల మండలం చింత బండ పోలింగ్ కేంద్రం లోని ఈవీఎంలో... సమస్య ఎదురైంది. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు.

09:38 October 21

ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా అభ్యర్థి చావాకిరణ్మయి

తెదేపా అభ్యర్థి చావాకిరణ్మయి

    హుజూర్​నగర్​ ఉపఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎస్​పి క్యాంపస్​లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

09:27 October 21

ఉదయం 9 గంటల వరకు 13.44 శాతం పోలింగ్​

హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది.  ఉదయం 9 వరకు 13.44 శాతం పోలింగ్​ నమోదయింది.

09:08 October 21

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

హుజూర్​నగర్​ ఉపఎన్నిక పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. తెరాస అభ్యర్థి సైదిరెడ్డి మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటు వేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

08:13 October 21

ఓటు హక్కు వినియోగించుకున్న సైదిరెడ్డి

ఓటు హక్కు వినియోగించుకున్న సైదిరెడ్డి

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో హుజూర్​నగర్​ ఉపఎన్నిక తెరాస అభ్యర్థి సైదిరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

08:12 October 21

పోలింగ్​ కేంద్రాల వద్ద 144 సెక్షన్​

    హుజూర్​నగర్​ నియోజకవర్గంలో 79  పోలింగ్​ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 540 మంది సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, 400 మంది టీఎస్​ఎస్పీ దళ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది సిబ్బంది పోలింగ్​ విధులు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్​ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్, యాక్ట్​ 30 అమల్లో ఉంది.

08:07 October 21

పటిష్ఠ బందోబస్తు మధ్య హుజూర్​నగర్​ పోలింగ్

        హుజూర్​నగర్​, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు మండలాల్లో పోలింగ్​ కొనసాగుతోంది. ఎస్పీ భాస్కరన్​ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

08:05 October 21

ఏడు మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్

    హుజూర్​నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో ఉపఎన్నిక పోలింగ్​ జరుగుతోంది. పోలింగ్​ కోసం 302 కంట్రోల్​ యూనిట్లు, 604 బ్యాలెట్​ యూనిట్లు, 302 వీవీప్యాట్లు ఏర్పాటు చేశారు. 369 మంది పీవోలు, 372 మంది ఏపీవోలు, 756 మంది ఓపీవోలు విధులు నిర్వర్తిస్తున్నారు.

07:37 October 21

హుజూర్​నగర్​ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం

హుజూర్​నగర్​ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక పోలింగ్​ ప్రారంభమైంది. 302 కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్​ కొనసాగనుంది. ఎన్నికల బరిలో ముగ్గురు మహిళలు సహా 28 మంది ఉన్నారు. 

Last Updated : Oct 21, 2019, 5:08 PM IST

ABOUT THE AUTHOR

...view details