ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులెవరూ ఆందోళన చెందవద్దని హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. మంగళవారం నుంచి మండల వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం విక్రయం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఐదు వందల ట్రాక్టర్ల ధాన్యాన్ని మిర్యాలగూడకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అపోహలను నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించవద్దు: సైదిరెడ్డి - grain purchase in suryapet district
ధాన్యం కొనుగోలుపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. అపోహలను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించొద్దని సూచించారు.
500 కూపన్లు వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాల వద్ద, మార్కెట్ కమిటీల వద్ద అందుబాటులో ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు మద్దతు ధరకే ధాన్యం విక్రయించాలని సూచించారు. అపోహలను నమ్మి తక్కువ ధరకు విక్రయించవద్దని చెప్పారు. తేమ శాతం కంటే తక్కువగా ఉంటే మద్దతు ధర (రూ.1880) కంటే ఎక్కువ చెల్లించేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లో గోదాములు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఇదీ చూడండి: ముందు జాగ్రత్తగా మందులు.. దండిగా ఖర్చులు..