తెలంగాణ

telangana

ETV Bharat / state

హజూర్​నగర్​లో సైదిరెడ్డి విజయోత్సవ ర్యాలీ - హజూర్​నగర్​లో విజయోత్సవ ర్యాలీ

పార్టీలకు అతీతంగా పని చేస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హుజూర్​ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.

హజూర్​నగర్​లో సైదిరెడ్డి విజయోత్సవ ర్యాలీ

By

Published : Oct 25, 2019, 12:36 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గ ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్థి సైదిరెడ్డి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు అతీతంగా పని చేస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సైదిరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. తన గెలుపుతో ప్రభుత్వానికి మరింత బలం చేకూరిందని తెలిపారు. కార్యకర్తలు, నాయకులందరూ తన వెన్నంటే ఉంటూ నియోజక వర్గ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు.

హజూర్​నగర్​లో సైదిరెడ్డి విజయోత్సవ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details