లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - huzur Nagar MLA Saidireddi Distributes Kalyana Lakshmi Cheques
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సైదిరెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
![లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ huzur Nagar MLA Distributes Kalyana Lakshmi Cheques to Beneficiaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7180126-844-7180126-1589369280035.jpg)
లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సైదిరెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విడతలో 25 మందికి అందజేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతుబంధు పథకం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి పది రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇప్పటిలాగే భౌతికదూరం పాటించాలని కోరారు.