ముగిసిన హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారం - huzur nagar by election 2019 campaign close
![ముగిసిన హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4803878-343-4803878-1571485953210.jpg)
17:00 October 19
ముగిసిన హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారం
హోరాహోరీగా సాగిన హుజూర్నగర్ ఉపఎన్నికల ప్రచారానికి తెరపడింది. పల్లెల్లో మారుమోగుతున్న డప్పు చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్ అయ్యాయి. ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పక్షంతో పాటు ప్రధాన ప్రతిపక్షాల.. విమర్శలు, ప్రతి విమర్శలు ఆగిపోయాయి. సభలు, సమావేశాలు సమాప్తమయ్యాయి. ఈనెల 21న పోలింగ్ జరగనుంది. పోటీలో ఉన్న 28 మంది అభ్యర్థుల భవితవ్యం ఈనెల 24న తెలనుంది. అధికారులు ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అభ్యర్థులు గెలుపు కోసం... తెర చాటు ప్రయత్నాలు ఊపందుకోనున్నాయి. అభ్యర్థులందరికీ ఈ కాస్త సమయమే చాలా కీలకం.
ఇదీ చూడండి: బ్యాంకు దివాలా తీస్తే... మీరు ఏం చేయాలి?