సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆర్థిక సాయం చేశారు. హుజూర్నగర్కు చెంది కూడితెట్టి ప్రసాద్, మట్టంపల్లి మండలం యతవకీళ్ల గ్రామానికి చెందిన బైరి కనకయ్యల కుటుంబాలకు చెరో రూ.2 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
కార్యకర్తల సంక్షేమమే తెరాస ధ్యేయం: ఎమ్మెల్యే సైదిరెడ్డి - Accident insurance checks issued to trs party activists in huzurnagar
పార్టీ కార్యకర్తల సంక్షేమమే తెరాస ప్రధాన ధ్యేయమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.
సూర్యాపేట జిల్లాలో తెరాస కార్యకర్తలకు ప్రమాద బీమా చెక్కులు
నియోజకవర్గంలోని 7 మండలాల్లో మొత్తం 26 మంది లబ్ధిదారులకు రూ.9,32,500 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తల సంక్షేమమే తెరాస పార్టీ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల తెరాస అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.