సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మహమ్మద్ రుబీనా బేగం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో భాదపడుతోంది. రెండేళ్లుగా ఆమె భర్త బతుకుదెరువుకు సౌదీ వెళ్లి ఉంటున్నాడు. తనకు ఆరోగ్యం బాలేని సమయంలో భర్త తోడుగా లేరని భావించిన రుబీనా భావోద్వేగానికై గురైంది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై తుంగతుర్తి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
రెండేళ్లుగా భర్త ఉద్యోగం సౌదీలో... భార్య ఆత్మహత్య - భర్త సౌదీలో ఉద్యోగం.. భార్య సూర్యాపేట జిల్లాలో నివసిస్తోంది.
భర్త సౌదీలో ఉద్యోగం.. భార్య సూర్యాపేట జిల్లాలో నివసిస్తోంది. తనకు ఆరోగ్యం బాలేని సందర్భంలో కూడా తోడుగా భర్త లేరని తీవ్ర మనో వేదనకు గురైంది. చివరికి ఆవేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో చోటుచేసుకుంది.
![రెండేళ్లుగా భర్త ఉద్యోగం సౌదీలో... భార్య ఆత్మహత్య Husband employed in Saudi .. wife suicide at suryapet district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5333835-31-5333835-1576002145767.jpg)
భర్త సౌదీలో ఉద్యోగం.. భార్య ఆత్మహత్య