సూర్యాపేట జిల్లా మోతే మండలం రావిపహాడ్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య కలతలు రావడం వల్ల గొడవపడి భార్య బావిలో దూకగా... భార్యను కాపాడబోయి భర్త మృతి చెందాడు. బావిలో దూకి భార్యను ఒడ్డుకు చేర్చిన భర్త మేడిపల్లి రవి... అనంతరం ఆయాసంతో వ్యవసాయ బావి నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడు మేడిపల్లి రవికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల పిల్లలు బలి అయిపోతున్నారు.
బావిలో దూకిన భార్యను కాపాడి భర్త మృతి - suryapet district
బావిలో దూకిన భార్యను కాపాడబోయి భర్త మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలోని రావిపహాడ్లో చోటుచేసుకుంది.
భార్యను కాపాడబోయి భర్త మృతి