తెలంగాణ

telangana

ETV Bharat / state

మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు - సూర్యాపేట జిల్లా వార్తలు

సూర్యాపేట జిల్లాలోని మట్టపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఎనిమిది నెలల అనంతరం లెక్కింపు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Hundi counting at Mattapally Lakshminarasimha Swamy Temple in suryaper district
మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు

By

Published : Aug 13, 2020, 10:54 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి హుండీలో నగదు లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో రూ.10.59 లక్షలు కానుకల రూపంలో భక్తులు సమర్పించారు.

ఎనిమిది నెలల అనంతరం దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. భక్తులు స్వామివారికి ఎక్కువగా నగదు రూపంలో కానుకలు సమర్పించారని ఆలయ అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: మాతృభాషలో బోధన విద్యార్థులకు ఉపయోగకరం: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details