రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వాహనాల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ఏపీ రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్పోస్ట్ వద్ద అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్ది, డీజీపీ నుంచి అనుమతులు ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
గరికపాడు చెక్పోస్ట్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు - గరికపాడు చెక్పోస్ట్ తాజా వార్తలు
అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని గరికపాడు చెక్పోస్ట్ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. సుమారు అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి.

గరికపాడు చెక్పోస్ట్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు
అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఆంధ్ర పోలీసులు చెబుతున్నారు. అనుమతి పత్రాలు లేని వాహనాలను అనుమతించబోమని వెల్లడించారు. ఏపీలోకి ప్రవేశించే వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారంటైన్ ముద్రలు వేస్తున్నారు.
ఇదీచూడండి: కూత పెడుతున్న రైళ్లు.. క్యూ కట్టిన ప్రయాణికులు...