తెలంగాణ

telangana

ETV Bharat / state

నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు - పులిచింతల ప్రాజెక్టు తాజా వార్తలు

పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులకు గాను... ప్రస్తుతం 174.45 అడుగులకు చేరింది.

నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు
నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు

By

Published : Sep 20, 2020, 3:13 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్ట్ ఇన్​ఫ్లో 3,68,870 క్యూసెక్కులు ఉండగా.. ఔట్​ఫ్లో 3,19,302 క్యూసెక్కులు ఉంది. విద్యుత్ ఉత్పాదన ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రాజెక్టు 10 గేట్లను మూడు మీటర్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 45.51 వద్ద ఉంది.

నిండు కుండలా పులిచింతల ప్రాజెక్టు

ఇదీ చూడండి: ఎస్పారెస్పీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details