ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటకు రానున్నారు. కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించి.. రూ.5 కోట్ల చెక్కు, సంతోష్‌బాబు భార్య సంతోషికి ఉద్యోగ నియామక పత్రం, హైదరాబాద్‌లో స్థలానికి సంబంధించిన పత్రాలను స్వయంగా అందించనున్నారు.
సూర్యాపేటలో సీఎం పర్యటనకు భారీ బందోబస్తు - సీఎం రాక దృష్ట్యా పోలీసుల బందోబస్తు వార్తలు
గల్వాన్ ఘటనలో అమరుడైన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేటకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 650 మంది సిబ్బందితో సంతోష్‌బాబు ఇంటి పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
సూర్యాపేటకు సీఎం రాక.. పోలీసుల భారీ బందోబస్తు
ఈ నేపథ్యంలో సూర్యాపేటలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 650 సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. సంతోష్‌బాబు ఇంటి పరిసర ప్రాంతమైన విద్యానగర్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సూర్యాపేట కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల్లోని ఆయా వీధుల్లో ప్రజలు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.