రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం కేరళ తరహా సంచార కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు నేరుగా వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్ని ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయో తెలపాలని స్పష్టం చేసింది. సూర్యాపేటలో కరోనా పరీక్షలు నిర్వహించడం లేదని పేర్కొంటూ బీజేవైఎం నాయకుడు సంకినేని వరుణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
'జిల్లాల వారీగా కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వండి' - కరోనా ల్యాబ్‌లపై హైకోర్టు విచారణ
ప్రజలు నేరుగా వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్ని ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. జిల్లాల వారీగా కరోనా పరీక్షలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సూర్యాపేటలో కరోనా పరీక్షలు నిలిపివేశారన్న వ్యాజ్యంపై ధర్మాసనం విచారించింది.
high court
సూర్యాపేటలో గత నెల 22 నుంచి పరీక్షలు జరపకుండానే.. గ్రీన్ జోన్‌గా ప్రకటించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అందరికీ పరీక్షలు జరపకపోతే.. కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందన్నారు. ఏప్రిల్ 22 నుంచి సూర్యాపేటలో కరోనా పరీక్షలు జరిపారో లేదో ఈనెల 26లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. జిల్లాల వారీగా కరోనా పరీక్షల వివరాలు తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:సమగ్ర వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్