సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో అర్ధరాత్రి ఇల్లు దగ్ధమైంది. రాత్రి 2:30గంటల సమయంలో గ్యాస్ లీకవ్వడం వల్ల కాలి బూడిదైంది. ఇంటి యజమాని వేముల రమేశ్ కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లగా ఈ ఘటన జరిగింది.
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం.. తప్పిన ప్రాణనష్టం - telangana varthalu
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధమైన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం
స్థానికులు మంటలు ఆర్పే లోపే ఇల్లు కాలి బూడిదైనట్లు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
ఇదీ చదవండి: పెళ్లి ఆగిందనే మనస్తాపంతో యువతి ఆత్మహత్య