తెలంగాణ

telangana

ETV Bharat / state

అనాథలుగా మారిన ఆడపిల్లలకు గ్రామస్థుల చేయూత - ముకుందాపురంలో అనాథ పిల్లలకు చేయూత

అల్లారు ముద్దుగా చూసుకునే అమ్మ సంవత్సరం క్రితమే చనిపోయింది. అన్నీతానై నాన్నే ముగ్గురు పిల్లలను పోషిస్తున్నాడు. విధి ఆడిన వింతనాటకంలో నాన్న అనారోగ్యంతో మృతి చెందడం వల్ల అనాథలుగా మారిని ఆ ఆ ముగ్గురు చిన్నారులకు గ్రామస్థులు బాసటగా నిలిచారు. రూ. 40 వేలు విరాళాలు సేకరించారు.

help to orphan childrens at mukundapuram village suryapet district
అనాథలుగా మారిన ఆడపిల్లలకు గ్రామస్థుల చేయూత

By

Published : Aug 2, 2020, 5:31 PM IST

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన మీసాల పరుశరాములుకు గత నెల 20న అనారోగ్యంతో మరణించాడు. భార్య గత సంవత్సరమే చనిపోవడం వల్ల అతని ముగ్గులు ఆడపిల్లలు అనాథలు అయ్యారు.

ఆ చిన్నారులను సంపూర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయం అందించాలని గ్రామస్థులు నిర్ణయించారు. సుమారు రూ. 40 వేలు విరాళాలు సేకిరించారు. ఆ ముగ్గురు పేర్ల మీద బ్యాంక్​లో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయనున్నట్లు సంపూర్ణ పౌండేషన్ సభ్యులు తేలిపారు. దాతలు ముందుకొచ్చి పిల్లలకు సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details