సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల డ్యాంకు వరద నీరు కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం వల్ల నీటి ప్రవాహం ఎక్కువైంది. పులిచింతల ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి... కృష్ణానదిలోకి రెండు లక్షల 80వేలు క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన ప్రవాహం.. 16 గేట్లు ఎత్తివేత - పులిచింతల ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత
నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తుండటం వల్ల... సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువైంది. 16 గేట్లు ఎత్తి రెండు లక్షల 80 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన ప్రవాహం.. 16 గేట్ల ఏత్తి నీటి విడుదల
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45 టీఎంసీలకు గానూ... 34 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం 175 అడుగులు కాగా... ప్రస్తుతం 167 అడుగులుగా నమోదైంది. జలాశయంలోకి రెండు లక్షల 60 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది.
Last Updated : Aug 22, 2020, 3:19 PM IST