తెలంగాణ

telangana

ETV Bharat / state

పాస్​ ఉంటేనే అనుమతి... రామాపురం వద్ద బారులు తీరిన వాహనాలు

రాష్ట్ర సరిహద్దులో మరోసారి వాహనాల తాకిడి నెలకొంది. ఏపీ నుంచి తెలంగాణ వచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం... సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్​పోస్ట్​కు చేరుకున్నారు. కరోనా విజృంభణ దృష్ట్యా ఈ-పాస్ లేనిదే ఎట్టిపరిస్థితుల్లోనూ పంపేది లేదంటూ పోలీసులు... చాలా మందిని వెనక్కు పంపించారు. గత రాత్రి నుంచి ఇప్పటివరకు వేల వాహనాలను తిప్పి పంపినట్లు పోలీసులు చెబుతున్నారు.

heavy traffic at ramapuram checkpost
పాస్​ ఉంటేనే అనుమతి... రామాపురం వద్ద బారులు తీరిన వాహనాలు

By

Published : Jun 12, 2021, 9:10 PM IST

ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చేందుకు యత్నించిన వేల వాహనాల్ని అనుమతి లేదన్న కారణంతో ఇక్కడి పోలీసులు వెనక్కు పంపించారు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్​పోస్టు వద్ద అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వారాంతం కావడంతో అటువైపు నుంచి పెద్దసంఖ్యలో వాహనాలు చెక్ పోస్టు వద్దకు చేరుకున్నాయి. తప్పనిసరిగా ఈ-పాస్ ఉండాల్సిందేనని రాష్ట్ర పోలీసులు స్పష్టం చేశారు. తాము హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తోందో వివరించినా... నిబంధనల మేరకు అనుమతి లేనిదే ఎవరినీ పంపేది లేదంటూ కరాఖండీగా చెప్పేశారు. అప్పటికే అక్కడ నాలుగైదు వందల వాహనాలు ఉన్నాయి. వాటన్నింటిని వెనక్కు పంపించే క్రమంలో ట్రాఫిక్ స్తంభించింది.

తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు లాక్​డౌన్​ సడలింపు ఉన్న దృష్ట్యా... ఆ లోపు వస్తే వదిలిపెడతారన్న భావనతో ఎక్కువ మంది అక్కడకు చేరుకున్నారు. అయితే అంబులెన్సులకు ఇబ్బంది కలగకుండా వాటిని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వీసు దారి గుండా పంపించివేశారు. మరోవైపు శుక్రవారం రాత్రి నుంచి ఈ-పాస్ ఉన్న 500 వాహనాల్ని రాష్ట్రంలోకి అనుమతించారు. వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారంటూ సూర్యాపేట జిల్లాలోని నాలుగు సరిహద్దులకు గానూ... కోదాడ మినహా మిగతా మఠంపల్లి, పులిచింతల, రామాపురం గ్రామ చెక్​పోస్టులను గత నెల 23 నుంచి మూసివేశారు. పాసులు ఉన్నవారు జాతీయ రహదారిపైన గల కోదాడ మీదుగానే రావాలని నిబంధన విధించారు. అయితే ప్రస్తుతం నాలుగు చెక్​పోస్టుల వద్ద... ఈ-పాసులు అడుగుతున్నారు. మూడ్రోజుల నుంచి లాక్​డౌన్​ సడలింపు కొనసాగుతుండటంతో... తమనూ అనుమతిస్తారన్న ఉద్దేశంతో వారాంతపు కోణంలో పెద్దసంఖ్యలో విచ్చేసినా వాహనాలు వెనక్కు వెళ్లక తప్పలేదు.

పాస్​ ఉంటేనే అనుమతి... రామాపురం వద్ద బారులు తీరిన వాహనాలు

ఇదీ చదవండి: SAVED CHILD: క్రౌడ్​ ఫండింగ్... పసివాడి ప్రాణం నిలిపింది

ABOUT THE AUTHOR

...view details