తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులను నిండాముంచిన అకాల వర్షం.. తడిసిముద్దైన ధాన్యం - తెలంగాణ వార్తలు

సూర్యాపేట జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షాలతో కోసిన పంట వర్షార్పణం అయింది. ఐకేపీ కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది.

rains in suryapet, crop drowned at ikp centres
సూర్యాపేటలో అకాల వర్షం, ఐకేపీ కేంద్రాల్లో తడిసిన ధాన్యం

By

Published : Apr 21, 2021, 6:45 PM IST

సూర్యాపేట జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన వరి పంటలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయి. కోదాడ, మునగాల, నడిగూడెం, చిలుకూరు, మోతె మండలాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో వరిపంట నేలకొరిగింది. మునగాల మండలం బరాఖత్‌గూడెం ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం వర్షార్పణమైంది.

ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో గాలివానకు చెట్లు విరిగిపడ్డాయి. రత్నవరం గ్రామంలో పిడుగుపాటుకు గురై... 19 మేకలు మృత్యువాతపడ్డాయి.

ఇదీ చదవండి:హనుమాన్ జన్మస్థలం ప్రకటన: 'శ్రీవారి ఆశీస్సులతో సాధ్యమైంది'

ABOUT THE AUTHOR

...view details