తెలంగాణ

telangana

ETV Bharat / state

పంట నష్టపోయిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

భారీ వర్షంతో సూర్యాపేట జిల్లాలోని మూసీ నది నిండిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కాగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

heavy rains in suryapet district bridge overflown
పంట నష్టపోయిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

By

Published : Oct 14, 2020, 4:17 PM IST

నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో మూసీ నదిపై ఉన్న శూన్యపహాడ్​ వంతెన పూర్తిగా మునిగిపోయింది. మఠం పల్లి, దామర చర్ల మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

పాలకీడు మండలంలో వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి:జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు మండలి ఆమోదం

ABOUT THE AUTHOR

...view details