తెలంగాణ

telangana

ETV Bharat / state

వరుణుడి దెబ్బకు వరి రైతుల కష్టాలు - సూర్యాపేట జిల్లా వార్తలు

అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు కర్షకులు కుదేలవుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేల ఎకరాల్లో వరి పంట నేలమట్టమైంది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.

heavy rain suryapeta district paddy farmers into trouble
వరుణుడి దెబ్బకు వరి రైతుల కష్టాలు

By

Published : Oct 13, 2020, 7:54 PM IST

వాయుగుండం ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలకు రైతన్నల కష్టం నీటిపాలవుతోంది. కోదాడ నియోజకవర్గంలో దాదాపు 1500 ఎకరాల వరిపంట నేలమట్టం అయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నడిగూడెం, అనంతగిరి, చిలుకూరు, మునగాల మండలాల్లో వరి పంట పూర్తిగా నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొన్ని మండలాల్లో వరితో పాటు పత్తి, మిరప పంటకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి పంటనష్టం వివరాలు నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి నేలకొరిగిందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:నేలకొరిగిన వరి పైరు.. అన్నదాత కళ్లలో కన్నీరు

ABOUT THE AUTHOR

...view details