సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో రాత్రి కురిసిన వర్షానికి చెరువులు అలుగులు పోశాయి. వాగులు, పిల్ల కాలువలు నీటితో నిండడం వల్ల జలకళ సంతరించుకుంది. జిల్లాలోనే నడిగూడెం మండలంలో అత్యధికంగా వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
నడిగూడెంలో భారీ వర్షం.. అలుగులు పోస్తున్న చెరువులు - heavy rain in suryapeta
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. చెరువులు, కుంటలు, పిల్లకాలువలు నీటితో పొంగి పొర్లాయి. కొన్నిచోట్ల పంటలు నీట మునిగాయి.

సూర్యాపేటలో భారీ వర్షం.. అలుగులు పోస్తున్న చెరువులు.
నడిగూడెం మండలంలో పత్తి, వరిపంట నీట మునగగా, అనంతగిరి మండలంలో అత్యధికంగా నారుమడులు మునిగిపోయాయి. దానితో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో భారీ వర్షం.. తడిసి ముద్దయిన జనం