తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు - Rain in joint nalgonda district

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురిశాయి. ఫలితంగా పలు మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

Nalgonda
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షం

By

Published : Jun 11, 2020, 4:11 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వివిధ మండలాల్లో జోరుగా కురిసిన వర్షంతో మంచి వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో అత్యధికంగా 10.9 సెంటీమీటర్ల వాన పడింది. మండలాల వారీగా చూస్తే... బొమ్మలరామారంలో 10.2, భువనగిరిలో 9.8, బీబీనగర్లో 8.7, భూదాన్ పోచంపల్లిలో 8.6, తుర్కపల్లిలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అటు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా... 28.5 వర్షం కురిసింది. తిరుమలగిరిలో 3.4, తుంగతుర్తి మండలంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చూడండి:జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్​కు లేఖ

ABOUT THE AUTHOR

...view details