వాయుగుండం ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఏకధాటి వర్షానికి హుజూర్‌నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో ఎర్ర వాగు పొంగి పొర్లుతోంది. వరద నీరు రోడ్డుపైకి వచ్చి రాకపోకలు నిలిచిపోయాయి.
సూర్యాపేటలో ఎడతెరిపి లేని వర్షం... పొంగుతోన్న ఎర్రవాగు - సూర్యాపేటలో వర్షాలు
సూర్యాపేట జిల్లాలో ఏకధాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గం దొండపాడు గ్రామంలోని ఎర్రవాగు పొంగి పొర్లుతోంది. వాననీరు రోడ్డు మీదకు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
సూర్యాపేటలో ఎడతెరిపి లేని వర్షం... పొంగుతోన్న ఎర్రవాగు
ఎర్ర వాగుపై వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. చిన్న వర్షం కురిసినా వాగు పొంగి... ఫలితంగా పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతులు వాపోయారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:వాగు దాటాలి.. విద్యార్థులను చేరాలి..
Last Updated : Oct 13, 2020, 2:33 PM IST