తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దగట్టుకు పోటెత్తిన భక్తులు - పెద్దగట్టు జాతర

సూర్యాపేట జిల్లాలో లింగమంతుల స్వామి జాతర వైభవంగా జరుగుతోంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు 3లక్షల మంది స్వామిని దర్శించుకున్నారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ 3 వేల మందితో బందోబస్తు చేపట్టింది.

లింగమంతుల స్వామి

By

Published : Feb 25, 2019, 10:41 PM IST

లింగమంతుల స్వామి జాతరకు తరలివచ్చిన భక్తులు
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్​పల్లిలో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. రెండోరోజు మధ్యాహ్నం వరకు సుమారు 3 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 75 బస్సులను నడుపుతున్నామని.. అవసరాన్ని బట్టి మరిన్ని సమకూరుస్తామని నల్గొండ రీజనల్​ ఆఫీసర్​​ ప్రభాకర్​ తెలిపారు. వికలాంగులకు ప్రయాణ రుసుములో 50శాతం రాయితీని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోలీసుల బందోబస్తు

జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు వెయ్యి మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిని రెండు భాగాలుగా విభజించి వచ్చి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. పార్కింగ్​ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. ట్రాఫిక్​ ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు జాతర జరగనుంది. ఏటా 8 నుంచి 10 లక్షల మంది తరలిరాగా.. ఈసారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:పారదర్శకత కోసమే...

ABOUT THE AUTHOR

...view details