తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రమాదమని తెలిసినా.. బాధ్యతను నిర్వర్తించారు - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

ఆ తండాకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే.. కానీ అక్కడ ఆ వాగు దాటేందుకు ఎటువంటి సౌకర్యాలు లేవు.. అయినా సాహసం చేసిన వైద్య సిబ్బంది వాగు దాటి.. తండాలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తమ బాధ్యతను నిర్వర్తించారు.

health staff gave polio drops to children in suryapeta district
ప్రమాదమని తెలిసినా.. బాధ్యతను నిర్వర్తించారు

By

Published : Feb 2, 2021, 8:57 AM IST

మనకెందుకులే అనుకోకుండా వైద్య సిబ్బంది తమ బాధ్యతను నిర్వర్తించారు. ప్రమాదమని తెలిసినా వాగు దాటి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సూర్యాపేట జిల్లా చిన్ననేమిల ఉప కేంద్రం పరిధిలోని పిజ్జా నాయక్ తండాకు వెళ్లాలంటే వాగు దాటాలి.

పిల్లలకు చుక్కల మందు అందించాలన్న లక్ష్యంతో వైద్యాధికారి త్రివేణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పాలేరు వాగును తాడు, ట్యూబ్​ సాయంతో దాటారు. తండాలోకి చేరుకున్నారు. చిన్నారులకు చుక్కల మందు వేశారు. వాగు దాటి తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బందికి తండావాసులు ధన్యవాదాలు తెలిపారు.

ప్రమాదమని తెలిసినా.. బాధ్యతను నిర్వర్తించారు

ఇదీ చదవండి:హైదరాబాద్​లో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.1293 కోట్లు

ABOUT THE AUTHOR

...view details