సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్లవాన పడింది. తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో చేనేత కార్మికుల షెడ్డు పైకప్పు ఈదురుగాలులకు ఎగిరిపోయింది. జాజిరెడ్డిగూడెంలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.
ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన.. ఎగిరిపోయిన పైకప్పులు - సూర్యాపేట జిల్లా వార్తలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో వడగండ్ల వాన పడింది. ఈదురుగాలుల వల్ల నియోజకవర్గంలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. అడ్డగూడూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసింది.
ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన.. ఎగిరిపోయిన పైకప్పులు
నాగారం మండలంలో పిడుగు పడడం వల్ల సుమారు 30 వేల విలువగల గేదె మృతి చెందింది. అడ్డగుడూర్ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు ఐదు వేల బస్తాల ధాన్యం తడిసింది.
ఇవీ చూడండి:రోడ్డుపై కూలిన చెట్లను తొలగించిన ఎస్సై