తెలంగాణ

telangana

ETV Bharat / state

వారికే ఓట్లు వేయించి గెలిపించా: మండలి ఛైర్మన్ గుత్తా - మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో శాసనమండలి ఛైర్మన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. ఆరోపణలు చేస్తున్న వారికే ఓట్లు వేయించి గెలిపించానని తెలిపారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి

By

Published : Oct 1, 2019, 8:54 PM IST

వారికే ఓట్లు వేయించి గెలిపించా: గుత్తా

హైదరాబాద్​ శాసనమండలి, సచివాలయ ఉద్యోగుల బతుకమ్మ సంబురాల్లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో శాసనమండలి ఛైర్మన్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై స్పందించారు. ఆరోపణలు చేస్తున్న వారికే ఓట్లు వేయించి గెలిపించిన విషయం మరిచిపోరాదని పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు. ఛైర్మన్ పదవిలో ఉండగా తెరాస తరపున ఓట్లను అడిగే అర్హత లేదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో ఉత్తమ్ తెలుసుకొని మాట్లాడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details