తెలంగాణ

telangana

ETV Bharat / state

'మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సేవలో గుత్తా' - సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఏ స్థాయిలో ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటా : గుత్తా

By

Published : Sep 17, 2019, 10:41 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామిని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని..ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఛైర్మన్​గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకుని వెళ్తానని అన్నారు. అందరికీ సహాయ సహకారాలు అందిస్తానని.. భవిష్యత్​లో ఏ స్థాయిలో ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఏ స్థాయిలో ఉన్నా అందరికీ అందుబాటులో ఉంటా : గుత్తా

ABOUT THE AUTHOR

...view details