"హాలియాలో సీఎం కేసీఆర్ సభ జరుగుతుంది. గుర్రంపోడు తండా నుంచి 500 మంది వెళ్లాలి. గుర్రంపోడు గ్రామసర్పంచ్ పార్వతి రామారావు తెలియపరుస్తున్నారు అందరికి.." ఈ విధంగా తాను తండాలో ప్రచారం చేస్తే... కొందరు ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్యం ప్రచారం చేస్తున్నారని సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'సూర్యాపేట జిల్లాలో వైరల్ అవుతున్న గుర్రంపోడు సర్పంచ్ వీడియో' - పోలీసులకు ఫిర్యాదు చేసిన గుర్రంపోడు సర్పంచ్
హాలియాలో జరుగుతున్న సీఎం కేసీఆర్ సభకు వచ్చిన వారికి నగదు పంచుతామన్న ప్రచారంపై కేసు నమోదైంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా సర్పంచ్ పార్వతి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
!['సూర్యాపేట జిల్లాలో వైరల్ అవుతున్న గుర్రంపోడు సర్పంచ్ వీడియో' 'నేను డబ్బులిస్తానని చెప్పలేదు... సభకు వెళ్లండనే చెప్పాను'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10567925-thumbnail-3x2-sarpanch-rk.jpg)
'నేను డబ్బులిస్తానని చెప్పలేదు... సభకు వెళ్లండనే చెప్పాను'
'సూర్యాపేట జిల్లాలో వైరల్ అవుతున్న గుర్రంపోడు సర్పంచ్ వీడియో'
సభకు వెళ్లిన వారికి రూ.500 చొప్పున చెల్లిస్తామని ప్రచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇదీ చూడండి:సీఎం నాగార్జున సాగర్ పర్యటన షెడ్యూల్
Last Updated : Feb 10, 2021, 2:14 PM IST