తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమాజ చైతన్యానికి పాత్రికేయుల పాత్ర కీలకం' - పాత్రికేయులకు నిత్యావసరాల పంపిణీ

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో పాత్రికేయులకు సీఎం పీఆర్వో రమేష్ హజారి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సమాజ చైతన్యంలో పాత్రికేయుల పాత్ర కీలమన్నారు.

grocceries distribution to journalists in maddirala by cmpro azar ramesh
'సమాజ చైతన్యంలో పాత్రికేయుల పాత్ర కీలకం'

By

Published : May 1, 2020, 4:17 PM IST

సమాజాన్ని తమ రాతలతో చైతన్యం దిశగా తీసుకెళ్లే పాత్రికేయుల పాత్ర కీలకమని సీఎం పీఆర్వో రమేష్ హజారిఅన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాలలోని తెరాస కార్యాలయంలో పాత్రికేయులకు నిత్యావసర సరకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి సమన్వయకర్త రజాక్, సూర్యాపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గునగంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్ రెడ్డి, సీఐ రవి, ఎస్సై సాయి ప్రశాంత్, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్​రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details