రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దాళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని సూర్యాపేట జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక అన్నారు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించి రైతులకు మద్ధతుధర లభించేలా చర్యలు తీసుకున్నారన్నారు. తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో ఐకేపీ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది' - తూర్పుగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రం తాజా వార్త
రైతులు పండించిన ప్రతిధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సూర్యాపేట జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గుజ్జ దీపిక అన్నారు. తుంగతుర్తి మండలం తూర్పుగూడెంలో ఐకేపీ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది'
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకురావాలని కొనుగోలు కేంద్రాల్లో నిర్వహకులు అన్నదాతను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత, గుడిపాటి సైదులు, సర్పంచి గుజ్జ పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'రైతు అభివృద్ధిలోకి వస్తేనే... దేశాభివృద్ధి ముందుకు సాగుతుంది'