సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు పదో తరగతి విద్యార్థులకు తొమ్మిదో తరగతి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వీడ్కోలులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సందడి - maddirala
సూర్యాపేట జిల్లా మద్దిరాలలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం జరిపారు. అందులో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు హుషారెత్తించాయి.
హుషారెత్తించిన విద్యార్థుల నృత్యాలు
ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ మట్టపెల్లి శీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి జీవితంలో పదో తరగతి మొదటి మెట్టని ఆయన అన్నారు. విద్యార్థులు ఈ దశలోనే లక్ష్యాలను ఏర్పరచుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
ఇదీ చూడండి :కరోనా కట్టడికి కేంద్రం కృషి చేస్తోంది: కిషన్ రెడ్డి