సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరి స్టేజి సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన భిక్షమయ్య, నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు.
బైక్ను ఢీకొట్టిన టాటా ఏస్.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి - రోడ్డు ప్రమాదం వార్తలు
పండుగ నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లి.. సంతోషంగా గడిపి తిరిగి వెళ్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. అతడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో ఘటన చోటు చేసుకుంది.
బైక్ను ఢీకొట్టిన టాటా ఏస్... ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
ఉప్పలమ్మ పండుగ నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లి ద్విచక్రవాహనంపై నాగారం వెళ్తుండగా టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలై ఉన్న అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాగారం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ఇవీ చూడండి:ఇంటింటా చమురు మంట... సామాన్యులపైనే భారం