గోమాతకు కన్నీటి వీడ్కోలు - suriyapet
గోమాతగా ఎన్నో పూజలందుకున్న ఆవు మరణించింది. పవిత్రమైన ఆవుకు గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు.

గోమాతకు అంత్యక్రియలు
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని శ్రీ స్వయం భూ పార్వతీరామలింగేశ్వర దేవాలయంలో ఆవు నిత్యపూజలు అందుకుంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడి శనివారం మృతి చెందింది. ఇన్నాళ్లు తాము కొలిచిన గోమాతకు అంత్యక్రియలు జరిపేందుకు గ్రామస్థులంతా ముందుకొచ్చారు. కన్నీటి వీడ్కోలు పలికారు.
గోమాతకు అంత్యక్రియలు