ఎట్టకేలకు గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాకు చేరుకున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యనవాగు నుంచి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం ఎస్సారెస్పీ కాలువ ద్వారా 1100 క్యూసెక్కుల గోదావరి జలాలు సూర్యాపేట జిల్లాకు అందాయి. 69 డీబీఎంకు 300 క్యూసెక్కులు, 71డీబీఎంకు 800 క్యూసెక్కుల జలాలు పంపిణీ చేస్తున్నట్లు ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. 70డీబీఎంకు సోమవారం (జులై20)న జలాలు విడుదల చేస్తారు.
గోదావరి జలాలతో పులకించిన సూర్యాపేట జిల్లా - ముఖ్యమంత్రి కేసీఆర్
జనగామ జిల్లా కొడకండ్ల మండలం బయ్యనవాగు నుంచి గోదావరి నీళ్లు సూర్యాపేట జిల్లాకు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం 1100 క్యూసెక్కుల నీళ్లు సూర్యాపేట జిల్లాకు విడుదల చేశారు.
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి విడుదల అంశమై ఎస్సారెస్పీ అధికారులతో సమావేశం నిర్వహించారు. అప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకు.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉమ్మడి వరంగల్, నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి నీటి విడుదల తేదీ నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు ఆదివారం సాయంత్రం బయ్యన్న వాగు వద్ద గేట్లను ఎత్తి ఎస్సారెస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. జిల్లాలో చివరి ఆయకట్టు వరకు 1800 క్యూసెక్కుల నీటితో సుమారు 550 చెరువులను నింపుతామని తెలిపారు.
ఇదీ చూడండి :దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల