సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో తేదేపా అభ్యర్థి శ్రీమతి చావా కిరణ్మయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ రోడ్డు నుంచి లింగగిరి వరకు రోడ్‌షో చేశారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను ఒక్కసారి అవకాశం ఇవ్వండని అభ్యర్థించారు. ఇన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు స్థానికంగా ఇక్కడనే ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. గెలిపిస్తే హుజూర్నగర్ నియోజకవర్గంలో శాంతియుత వాతావరణం ఉంటుందని కిరణ్మయి అన్నారు.
హుజూర్‌నగర్‌లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి - హుజూర్ నగర్ పట్టణంలో తెదేపా అభ్యర్థి శ్రీమతి చావా కిరణ్మయి ఎన్నికల ప్రచారం
హుజూర్ నగర్ పట్టణంలో తెదేపా అభ్యర్థి శ్రీమతి చావా కిరణ్మయి ఎన్నికల ప్రచారం చేపట్టారు. పలువురు నాయకులను కలుసుకుని మద్దతు కోరారు.
హుజూర్‌నగర్‌లో ఒక్కసారి అవకాశం ఇవ్వండి