సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టు దగ్గర కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జెన్కో వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పనిచేసిన తమకు తగిన గుర్తింపు లభించాలని వారు డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ ధర్నా - contract workers protest at pulichintala
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లిలోని తెలంగాణ జెన్కో వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు.
కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ ధర్నా
గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు జెన్కో కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తున్న తమను ఈ నెల 15 నుంచి విధుల్లోకి తీసుకోకుండా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను వెంటనే విధుల్లోకి తీసుకుని తక్షణమే పర్మినెంట్ చేయాలని జెన్కో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
ఇదీ చూడండి:మీర్పేట్లో జలపాతాన్ని తలపిస్తోన్న ఓ ఇల్లు.. ఇదిగో వీడియో...