సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా దేనుమకొండ చలమరాజు ఇంటిపై దేనుమకొండ పృథ్వీరాజు, కోలాహలం సత్యనారాయణ రాజు కుటుంబ సభ్యులు గొడ్డళ్లు, సుత్తి, పెద్ద పెద్ద రాళ్లతో దాడి చేశారు.
గొడ్డళ్లు, రాళ్లతో ఇంటిపై దాడి... పలువురికి గాయాలు - FRICTION IN YATHAVAKILLA VILLAGE
కుటుంబ కలహాల కారణంగా ఇంటిపై దాడికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్లలో చోటుచేసుకుంది. ఈ దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
గొడ్డళ్లు, రాళ్లతో ఇంటిపై దాడి... పలువురికి గాయాలు
ఈ ఘర్షణలో చలమరాజు, లక్ష్మి తలపై తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా... పెట్రోలు పోసి ఇంటిని తగల బెట్టేందుకు ప్రయత్నించగా... గ్రామస్థులు అడ్డుకున్నారు. తీవ్ర రక్త స్రావం అవుతున్న చలమరాజు, లక్ష్మిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.