సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పేద ప్రజల సౌకర్యార్థం.. రెండు ఉచిత అంబులెన్సులు, ఓ శానిటైజర్ వ్యాన్ను ఏర్పాటు చేస్తున్నట్లు యువజన కాంగ్రెస్ తెలంగాణ ఎస్సీ విభాగం ఛైర్మన్ ప్రీతం తెలిపారు. కరోనా కష్ట కాలంలో ఆసుపత్రులకు వెళ్లేలోపే పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలందరూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ నగరాలకు వాహనాలను తీసుకెళ్లవచ్చునని తెలిపారు.
ఆపత్కాలంలో ప్రజల అవసరాన్ని బట్టి ప్రైవేటు వాహనదారులు రూ.15 నుంచి 30 వేల వరకు దోచుకుంటున్నారని ప్రీతం తెలిపారు. ఉచిత అంబులెన్సులను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
తుంగతుర్తిలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం - ఉచిత అంబులెన్స్ సౌకర్యం
ఆపదలో ఉన్నవారిని సత్వరమే ఆసుపత్రికి చేర్చేందుకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో.. ఉచిత అంబులెన్స్ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువజన కాంగ్రెస్ తెలంగాణ ఎస్సీ విభాగం ఛైర్మన్ ప్రీతం.. నియోజకవర్గంలోని పేదలకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
free ambulence