తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యయత్నం

తన పేరు మీద ఉన్న భూమిని కొత్త రికార్డుల్లో నమోదు చేయాలని ఎమ్మార్వోను వేడుకున్నాడు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

రైతు ఆత్మహత్యయత్నం

By

Published : Jul 2, 2019, 6:32 PM IST


కార్యాలయాల చుట్టూ.. కాళ్లరిగేలా తిరిగినా.. తన పనికావడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్​లో చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన రైతు కళ్లెం చెర్ల నాగయ్యకు 48వ సర్వేనెంబర్​లో ఒక ఎకరం 8 గుంటల భూమి పాత రికార్డులో ఉంది. ఇటీవల నిర్వహించిన భూ ప్రక్షాళనలో కేవలం 21 గుంటల భూమి మాత్రమే సాగులో ఉన్నట్లు గుర్తించారు. పాత రికార్డులో తనకు ఉన్న ఎకరం 8 గుంటల భూమిని కొత్త రికార్డులో చేర్చాలని సదరు రైతు మొరపెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ..ఎమ్మార్వో మాత్రం రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

రైతు ఆత్మహత్యయత్నం

ABOUT THE AUTHOR

...view details