సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పిల్లలు గొప్పవారు కావాలంటే వారి తల్లిదండ్రులే మార్గదర్శకులుగా నిలవాలన్నారు. పిల్లల భవిష్యత్‌కు తల్లిదండ్రులు ఆధారంగా ఉండాలని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులుగా ఎదగాలంటే వారికి సరైన సమయం కేటాయించాలని కోరారు.
'పిల్లలకు తల్లిదండ్రులే మార్గదర్శకులు'
పిల్లలు గొప్పవారు కావాలంటే వారి తల్లిదండ్రులే మార్గదర్శకులుగా నిలవాలని సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
'పిల్లలకు తల్లిదండ్రులే మార్గదర్శకులు'
పిల్లలకు దాతృత్వం, నైతిక విలువలు నేర్పించడం వల్ల వారు ఉత్తమ సమాజ నిర్మాతలు అవుతారని పేర్కొన్నారు. సమయం దొరికినప్పుడల్లా పిల్లలచే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను చదివించాలని సూచించారు. తిరుమలగిరి మున్సిపాలిటీ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలన్నారు.
ఇదీ చదవండి:వీసా ఆంక్షలపై సమాచారం కోసం అమెరికాలో హెల్ప్లైన్లు