తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్లలోకి వరద నీరు... భయం గుప్పిట్లో స్థానికులు - flood water in mattapalli

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి రావడం వల్ల సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వరద నీటితోపాటు పాములు, పురగులు ఇళ్లలోకి వస్తున్నాయని భయాందోళనలకు గురవుతున్నారు.

flood water enter into homes in mattapalli village suryapet district
ఇళ్లలోకి వరద నీరు... భయం గుప్పిట్లో స్థానికులు

By

Published : Sep 14, 2020, 4:18 PM IST

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతుంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరడం... దీనికి తోడు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు భారీగా వరద ఇళ్లల్లోకి వస్తుందని స్థానికులు వాపోతున్నారు.

దీనకి తోడు మొసళ్లు, పాములు, చిన్న చిన్న పురుగులు ఇళ్లల్లోకి వస్తున్నాయని... చిన్న పిల్లలతో ఇంట్లో ఉండాలంటే భయమేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:సూర్యాపేట జిల్లాలో వర్షం.. నిండుకుండను తలపిస్తున్న చెరువులు

ABOUT THE AUTHOR

...view details